News February 11, 2025
ఊట్కూర్: రెండు బైకులు ఢీ.. నలుగురికి గాయాలు

రెండు బైకులు ఢీకొని నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరులోని మోడల సమీపంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపోర్ల గ్రామానికి చెందిన రాజు.. అన్న అంజిలయ్య, వదిన నాగమ్మతో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం ఊట్కూర్కు బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. 108లో వారిని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 2, 2025
ఖమ్మం: తొలిరోజే రూ.33 కోట్ల మద్యం విక్రయాలు

2025–27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 204 వైన్ షాపుల్లో సోమవారం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజే వైరా ఐఎంఎల్ డిపో నుంచి ఏకంగా రూ.33 కోట్ల విలువైన మద్యం సరఫరా చేశారు. ఇందులో 38,685 మద్యం కేసులు, 17,298 బీరు కేసులు ఉన్నాయి. నెల రోజులుగా బ్రాండ్లు లేక ఇబ్బంది పడిన మద్యం ప్రియులకు అన్ని రకాలు అందుబాటులోకి వచ్చాయి.
News December 2, 2025
తిరిగి విధుల్లోకి ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్

వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఆర్డర్స్ తీసుకున్న ఆయన సోమవారం అనంతపురం ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో తిరిగి విధుల్లో చేరనున్నట్లు ప్రకాశ్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News December 2, 2025
ఖమ్మం: చెక్ బౌన్స్.. ఏడాది జైలు, రూ.19 లక్షల పరిహారం

ఖమ్మం నర్తకి థియేటర్ ప్రాంతానికి చెందిన ఎ.రవిబాబుకి చెల్లని చెక్కు కేసులో ఖమ్మం రెండో అదనపు కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందు ఏడాది జైలు శిక్షతో పాటు ఫిర్యాదుదారుడికి రూ.19 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సోమవారం తీర్పు చెప్పారు. 2014లో రూ.15 లక్షల అప్పు తీసుకున్న నిందితుడు, 2016లో రూ.19 లక్షల చెక్కు జారీ చేయగా ఖాతాలో సరైన నగదు లేకపోవడంతో కోర్టులో కేసు దాఖలు చేయగా పైవిధంగా తీర్పునిచ్చారు.


