News February 11, 2025
ఊట్కూర్: రెండు బైకులు ఢీ.. నలుగురికి గాయాలు

రెండు బైకులు ఢీకొని నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరులోని మోడల సమీపంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపోర్ల గ్రామానికి చెందిన రాజు.. అన్న అంజిలయ్య, వదిన నాగమ్మతో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం ఊట్కూర్‌కు బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. 108లో వారిని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 18, 2025
టెన్త్ అర్హత.. CISFలో 1,161 ఉద్యోగాలు

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 1,161 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టులకు ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, సంబంధిత ట్రేడ్‌లో ITI పాసైన 18-23 ఏళ్లలోపు వారు అర్హులు. PET, PST, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రూ.21,700-69,100 జీతం చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://cisfrectt.cisf.gov.in/
News March 18, 2025
పెద్దపల్లి: నేడు ఇంటర్మీడియట్ పరీక్షలకు 111మంది గైర్హాజరు

పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్లకు పరీక్షలు జరిగాయన్నారు. 4927 విద్యార్థులకు 4816 హాజరయ్యారని పేర్కొన్నారు. 111 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో జనరల్ 71 మంది, వొకేషనల్ 40మంది విద్యార్థులు హాజరుకాలేదన్నారు.
News March 18, 2025
నల్గొండ: పనుల ప్రారంభం వేగవంతం చేయాలి: కలెక్టర్

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో నల్గొండ బైపాస్ జాతీయ రహదారి 565కు సంబంధించి అవార్డు పాస్ చేయడం, పనుల ప్రారంభం వంటివి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె తన ఛాంబర్‌లో నేషనల్ హైవే 565 నల్గొండ బైపాస్‌పై జాతీయ రహదారుల సంస్థ అధికారులు ,ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశం అయ్యారు.