News January 26, 2025
ఊట్కూర్: వ్యక్తి అదృశ్యం.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు

ఊట్కూర్ మండల పరిధిలోని అవులోని పల్లి గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మయ్య(32) అదృష్టమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వివరాలు.. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో లక్ష్మయ్య తన బట్టలను ఇస్త్రీ చేయించుకుని వస్తానని బయటికి వెళ్లి తిరిగి రాలేదు అని తెలిపారు. గ్రామంలో ఆరా తీసినా, ఇతర సమీప బంధువుల ఇళ్లలో ఎంత వెతికిన ఫలితం లేకపోయేసరికి భార్య తిమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News March 12, 2025
ఖమ్మం: పట్టుపట్టాడు.. కొలువులు సాధిస్తున్నాడు..

పట్టుదలతో ప్రభుత్వ కొలువులు సాధించుకుంటూ వస్తూ యువతకు ఆదర్శంగా నిలిచాడు. తాజాగా గ్రూప్- 2లో 387 మార్కులతో స్టేట్ 148 ర్యాంక్, జోన్‌లో 20వ ర్యాంక్ సాధించాడు. అతడే తల్లాడ మండలం మల్లవరంకు చెందిన దుగ్గిదేవర వెంకటేశ్వరరావు. తొలి ప్రయత్నంలోనే 2018లో పంచాయితీ కార్యదర్శిగా, 2019లో FBOగా, 2020లో విద్యుత్ శాఖలో జూనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్ కొలువులను వరుసగా సాధిస్తూ వచ్చాడు.
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. హనుమకొండ జిల్లాకు ఏం కావాలంటే?

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లాలోని పెండింగ్ పనులను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మామునూరు ఎయిర్‌పోర్ట్ భూ-సేకరణ పూర్తి చేయాలని, కాజీపేట రైల్వే ఫ్లై-ఓవర్ చేపట్టాలని కోరుతున్నారు. WGL కలెక్టరేట్ పనులు, నూతన బస్టాండ్ పనులు, టెక్స్ టైల్ పార్కులో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.
News March 12, 2025
సొంత నిధులతో అన్నదాన సత్రం పునర్నిర్మిస్తా: మంత్రి లోకేశ్

AP: కడప జిల్లాలోని కాశీనాయన అన్నదాన సత్రం కూల్చివేతపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కూల్చివేయడం బాధాకరం. నిబంధనలు ఉన్నా భక్తుల మనోభావాలు గౌరవించి కూల్చకుండా ఉండాల్సింది. దీనిపై ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను. కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. త్వరలో నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాను’ అని ట్వీట్ చేశారు.