News April 2, 2025

ఊర్కోండ: ఒంటరి మహిళ, ప్రేమ జంట కనిపిస్తే అంతే సంగతులు!

image

ఊర్కోండ మండలంలోని పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వివాహితపై 8 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కొంతకాలంగా దేవాలయం వద్దకు వచ్చే మహిళల పట్ల పోకిరీల ఆగడాలు అధికమైనట్లు తెలుస్తుంది. గతంలో అనేకమంది మహిళలకు వేధింపులు ఎదురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News November 21, 2025

రెండో టెస్టుకు గిల్ దూరం.. ముంబైకి పయనం

image

మెడనొప్పితో బాధపడుతున్న టీమ్ఇండియా టెస్ట్ కెప్టెన్ గిల్ సౌతాఫ్రికాతో జరగాల్సిన రెండో టెస్టుకు దూరమయ్యారు. ICUలో చికిత్స పొంది జట్టుతో పాటు గువాహటికి చేరుకున్న ఆయనకు ఇవాళ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఫెయిల్ కావడంతో జట్టు నుంచి రిలీజ్ చేశారు. కొద్దిసేపటి కిందటే గిల్ ముంబైకి పయనమయ్యారు. అక్కడ వైద్య నిపుణుల పర్యవేక్షణలో 3 రోజులు చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

News November 21, 2025

నాగర్ కర్నూల్ జిల్లాలో చలి పంజా

image

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెల్దండ మండలం బొల్లంపల్లిలో అత్యల్పంగా 14.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తోటపల్లి 14.2డిగ్రీలు, బిజినపల్లి, తెలకపల్లి 14.9, యంగంపల్లి 15.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో అధిక చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

News November 21, 2025

వంటగది చిట్కాలు

image

* చపాతీ పిండిలో టేబుల్ స్పూన్ పాలు, బియ్యప్పిండి, నూనె వేసి ఐస్ వాటర్‌తో కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి.
* పల్లీలు వేయించేటప్పుడు 2 స్పూన్ల నీరు పోసివేయిస్తే తొందరగా వేగడంతో పాటు పొట్టు కూడా సులువుగా పోతుంది.
* కొత్త చీపురుని దువ్వెనతో శుభ్రం చేస్తే అందులో ఉండే దుమ్ము పోతుంది.
* వెల్లుల్లికి వైట్ వెనిగర్ రాస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
* పాలను కాచిన తర్వాత ఎండ, వేడి పడని చోట పెట్టాలి.