News April 2, 2025
ఊర్కోండ: ఒంటరి మహిళ, ప్రేమ జంట కనిపిస్తే అంతే సంగతులు!

ఊర్కోండ మండలంలోని పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వివాహితపై 8 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా దేవాలయం వద్దకు వచ్చే మహిళల పట్ల పోకిరీల ఆగడాలు అధికమైనట్లు తెలుస్తుంది. గతంలో అనేకమంది మహిళలకు వేధింపులు ఎదురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News November 24, 2025
శత జయంతి ఉత్సవాలు బ్లాక్బస్టర్!

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈనెల 13న మొదలై 23న విజయవతంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, లేజర్ షో ఈవెంట్స్ భక్తులను మైమరపించాయి. జిల్లా అధికారులు, పోలీసులు, సాయి సేవాదళ్ సభ్యులు విశేష సేవలందించి శత జయంతిని సక్సెస్ చేశారు.
News November 24, 2025
WGL: జల వనరుల సర్వేలు: సీపీవోలే కన్వీనర్లు

వరంగల్లో జల వనరుల గణనలో భాగంగా, గ్రామాల్లోని చెరువుల నుంచి చిన్న చేదబావుల వరకు ప్రతీ నీటి వనరును సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో నమోదు చేస్తున్నారు. ప్రతి వనరుకు ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ సర్వేకు సీపీవోలు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. నీటి నిర్వహణ, సంరక్షణ, భవిష్యత్ ప్రణాళికలకు అవసరమైన సమగ్ర డేటాబేస్ను సిద్ధం చేయడమే ఈ గణన ప్రధాన లక్ష్యం.
News November 24, 2025
నల్గొండ జిల్లాలో బీసీలకు తగ్గిన స్థానాలు

నల్గొండ జిల్లాలో రిజర్వేషన్ల కేటాయింపులో రొటేషన్ విధానం బీసీలను దెబ్బతీసింది. 2019 ఎన్నికలతో పోలిస్తే భారీ ఎత్తున బీసీ రిజర్వేషన్లు తగ్గిపోవడంపై బీసీల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆదివారం ఆర్డీఓల ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సర్పంచ్ రిజర్వేషన్లు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 869 జీపీలు ఉండగా.. ఇందులో బీసీలకు 140 (2019లో 164) స్థానాలు రిజర్వ్ అయ్యాయి.


