News March 22, 2025
ఎంఎంటీఎస్ కోసం వేయికళ్లతో ఎదురుచూపు..!

వికారాబాద్ జిల్లా ప్రజలు MMTS రైలు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజు జిల్లా నుంచి సుమారుగా 10 – 12 వేల మంది ప్రయాణికులు HYDకు వెళ్లి వస్తున్నారు. కొన్నేళ్లుగా VKB రైల్వే స్టేషన్ జంక్షన్‌గా కొనసాగుతుంది. కాగా MMTS సర్వీస్ ప్రస్తుతం లింగంపల్లి వరకే ఉంది. కావున MMTS సర్వీస్‌ను VKB వరకు పొడిగిస్తే జిల్లా ప్రజలకు ఎంతగానో మేలవుతుంది. ప్రభుత్వం ఇందుకు కృషి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
Similar News
News March 26, 2025
ములుగు: రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి: అదనపు కలెక్టర్

ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ సంపత్ రావు తెలిపారు. తలసేమియా బాధితుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో ఔత్సాహికులు, రక్తదాతలు పాల్గొంటున్నారని తెలిపారు. కాగా జిల్లాలోని యువత, ఉద్యోగులు, పాత్రికేయులు, రక్తదాతలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
News March 26, 2025
KNR: అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం అందించాలి : కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, పురోగతి, బాధితులకు చెల్లించాల్సిన పరిహారం తదితర అంశాలపై విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగింది. కేసు పూర్వాపరాలను పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగే విధంగా అధికారులు చర్య తీసుకోవాలన్నారు.
News March 26, 2025
వనపర్తి: సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వండి: డీఎంహెచ్‌వో

ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రయత్నించాలని లేదంటే చర్యలు తప్పవని వనపర్తి జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు హెచ్చరించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సిజేరియన్లకు ప్రాధాన్యత ఇస్తే చర్యలు తప్పవన్నారు.