News February 20, 2025
ఎంఎస్ఎంఈ సర్వే తనిఖీ చేసిన: కలెక్టర్

నందిగామలో ఎంఎస్ఎంఈ సర్వే పరిశీలన కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశ గురువారం తనిఖీ చేశారు. అయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ సర్వేను విస్తృత స్థాయిలో చేపట్టడం జరుగుతోందని, ఆరోగ్యకర పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో ఈ సర్వేను చేపట్టడం జరిగిందని అన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాన్ని సంప్రదించాలని అయన కోరారు.
Similar News
News January 1, 2026
స్వచ్ఛరథం నిర్వహణకు ఏడు మండలాల్లో టెండర్ నోటిఫికేషన్

అడ్డతీగల, అరకు, చింతపల్లి, పాడేరు, రంపచోడవరం, రాజవొమ్మంగి, చింతూరు మండలాల్లో ప్రతి మండలం ఒక యూనిట్‌గా స్వచ్ఛరథం నిర్వహణకు టెండర్లు ఆహ్వానించారు. పొడి చెత్త, స్క్రాప్ నిర్వహణలో 3 ఏళ్ల అనుభవం, ట్రేడ్ లైసెన్స్ కలిగిన అర్హులు దరఖాస్తు చేయాలి. సంబంధిత MPDO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి.
News January 1, 2026
బంగ్లాకు US మొక్కజొన్నలు.. నెటిజన్ల సెటైర్లు!

బంగ్లాదేశ్‌కు అమెరికా నుంచి మొక్కజొన్నలు ఎగుమతి అవుతున్నాయి. దీనిపై US ఎంబసీ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. USలో కార్న్ సాగులో ఎరువుగా పంది మలం వాడటమే కారణం. మంచి పోషకాలతో మొక్కజొన్నలు వస్తున్నాయని ఎద్దేవా చేస్తున్నారు. ‘ఇప్పుడు పంది మలంతో పండించిన కార్న్ తింటారు’ అని కామెంట్లు చేస్తున్నారు. ట్రంప్ దుర్మార్గపు విధానాలకు పేద బంగ్లాదేశీయులు బలవుతున్నారని పేర్కొంటున్నారు.
News January 1, 2026
అనకాపల్లి: 15,173 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

అనకాపల్లి జిల్లాలో 35 వేల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి బుధవారం తెలిపారు. ఇప్పటివరకు 15,173 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. రబీలో పంటల విస్తీర్ణం సాధారణ విస్తీర్ణం కన్నా 4 వేల హెక్టార్ల మేర పెరిగే అవకాశం ఉందన్నారు. పంటలకు ఎరువులు పురుగు మందులు పిచికారీ చేసేందుకు 20 డ్రోన్లను అందుబాటులో ఉంచామన్నారు.


