News January 29, 2025
ఎంజీఎంలో పిల్లలకు గుండె వైద్య శిబిరం

ఈ నెల 30న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో సంయుక్తంగా పిల్లలకు గుండె పరీక్షల వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డీహెచ్ఎంఓ సాంబశివరావు తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు చిన్నారులకు ఉచితంగా 2D ఎకో పరీక్షలు నిర్వహిస్తారని, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయన్నారు. వరంగల్ జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News February 9, 2025
మినీ మేడారం జాతర మరో మూడు రోజులే!

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ జాతరకు 20 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు జంపన్న వాగు వద్ద స్నానాలు ఆచరించడానికి షవర్లు, తాగునీటి సదుపాయం, పార్కింగ్ స్థలాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. బుధవారం నుంచి శనివారం వరకు మినీ జాతర జరగనుంది.
News February 8, 2025
నిబంధనలు పాటిస్తేనే అనుమతులు: కమిషనర్

నిబంధనలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. వరంగల్ హనుమకొండ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాలన్నారు. హంటర్ రోడ్డు, యూనివర్సిటీ, శ్రీ సాయి నగర్, వరంగల్, ఆరెపల్లి ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి కొలతలు వేసి పరిశీలించారు. భవన నిర్మాణాలు చెప్పటానికి టీజీ బిపాస్ ద్వారా అనుమతుల జారీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
News February 8, 2025
జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశం: WGL కలెక్టర్

WGL జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ డా.సత్య శారద చైర్ పర్సన్ హోదాలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీలతో కలిసి జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.