News February 6, 2025

ఎంజీయూలో అధికారుల పదవీకాలం పొడిగింపు

image

ఎంజీ యూనివర్సిటీలో వివిధ విభాగాలలో సేవలందిస్తున్న వివిధ అధికారుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ సూచన మేరకు రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షల నియంత్రణ అధికారిగా సేవలందిస్తున్న డా జి.ఉపేందర్ రెడ్డిని మరో ఏడాది, ఐక్యూ ఏసీ డైరెక్టర్ డా.మిరియాల రమేశ్, ఆడిట్ సెల్ అడిషనల్ డైరెక్టర్‌గా డా వై.జయంతిని మరో ఏడాది కొనసాగించనున్నారు.

Similar News

News March 24, 2025

నల్గొండ: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. వివరాలిలా.. HYDకి చెందిన ఉదయ్‌కిరణ్ నేరేడుగొమ్ము మండలం పుష్కర ఘాట్‌లో మునిగి చనిపోయాడు. నల్గొండ మండలానికి చెందిన నవీన్ కుమార్, రాఘవేంద్ర ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందారు. సూర్యాపేట జిల్లాలోని బీబీగూడెంలో కారు, బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు.

News March 24, 2025

నల్గొండ: లాడ్జిలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

నల్గొండ పట్టణంలోని రూపా లాడ్జిలో గుర్తుతెలియని వ్యక్తి(35) డెడ్ బాడీని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇతడు విజయవాడ ఫైర్ వర్క్స్‌లో పనిచేస్తున్నట్లు లాడ్జి రికార్డ్స్‌లో ఉందని నల్గొండ టూ టౌన్ పీఎస్ SI సైదులు తెలిపారు. మృతుడిని నవీన్‌గా గుర్తించామన్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే 87126 70176 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News March 24, 2025

నేడు నల్గొండకు మంత్రి కోమటిరెడ్డి 

image

నల్గొండ జిల్లాకు నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9 గంటలకు నల్గొండలోని మంత్రి క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు. 9.30 గంటలకు అర్జలాబావిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 10.30 గంటలకు తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.

error: Content is protected !!