News June 19, 2024

ఎంజీయూ డిగ్రీ విద్యా ప్రణాళిక విడుదల

image

ఎంజీ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 3, 5 సెమిస్టర్ల విద్యా ప్రణాళికను యూనివర్సిటీ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ కొప్పుల అంజిరెడ్డి మంగళవారం విడుదల చేశారు. జూన్ 18 నుంచి తరగతులు ప్రారంభించి నవంబర్ 1 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్నల్ పరీక్షలు, సంక్రాంతి సెలవులు, ప్రిపరేషన్ హాలిడేస్ వివరాలను తెలుపుతూ సర్క్యులర్ జారీ చేశారు.

Similar News

News September 18, 2024

యాదాద్రి: నిమజ్జనానికి వెళ్లి యువకుడి మృతి

image

వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలంలో జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌యాదవ్ (27) వినాయక నిమజ్జనం కోసం చెరువుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతిచెందాడు. అప్పటివరకు తమతో ఆనందంగా గడిపిన స్నేహితుడు మృతిచెందడంతో అతడి మిత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News September 18, 2024

‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి’

image

రానున్న వానకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ప్రతిపాదనలు సమర్పించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో వానకాలం ధాన్యం కనీస మద్దతు ధర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు గాను జిల్లా వ్యాప్తంగా 400 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

News September 17, 2024

ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

image

నల్గొండ పట్టణంలోని పోలీస్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను మంత్రి కోమటిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం బాల బాలికల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ పవర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బాలునాయక్ తదితరులున్నారు.