News October 18, 2024
ఎంజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా ఖాజా అల్తాఫ్ హుస్సేన్
నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఖాజా అల్తాఫ్ హుస్సేన్ నియమితులయ్యారు. గతంలో కూడా ఆయన ఇక్కడ వైస్ ఛాన్సలర్‌గా పని చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంజీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
Similar News
News November 12, 2024
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి: ఎస్పీ
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ రైస్ మిల్లుల యజమానులను కోరారు. 110 రైస్ మిల్లుల వద్ద పోలీసులను ఏర్పాటు చేశామని, రైతులు దళారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని, ధాన్యం అమ్మకాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రైస్ మిల్లుల యజమానులను కోరారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News November 11, 2024
నల్గొండ జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. మునుగోడు మండలంలో తండ్రిని కుమారుడు హత్య చేశాడు. గ్రామస్థులు వివరాలిలా.. చొల్లేడు గ్రామానికి చెందిన కట్కూరి రామచంద్రం (70)కు నలుగురు సంతానం. పెద్ద కుమారుడు నరసింహ మద్యం మత్తులో గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. హత్యకి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.
News November 11, 2024
రైతులను మోసం చేస్తే.. మిల్లులు సీజ్ చేస్తాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,320 కన్నా తక్కువగా రైస్ మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఎవరైనా రైస్ మిల్లర్లు మద్దతు ధర కన్నా తక్కువగా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను మోసం చేసినట్లయితే రైస్ మిల్లును సీజ్ చేస్తామని హెచ్చరించారు. మిల్లును సీజ్ చేయడంతో పాటు, ఆ మిల్లుకు సంబంధించిన అన్ని రకాల లైసెన్సులను రద్దు చేస్తామన్నారు.