News April 25, 2024
ఎంటైర్ హైదరాబాద్ మాతో ఉంది: KCR
ఎంటైర్ హైదరాబాద్ మాతో ఉందని మాజీ CM KCR అన్నారు. ఓ ఛానెల్ డిబేట్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మిన పల్లె ప్రజలు ఆ పార్టీకి ఓటేశారని పేర్కొన్నారు. HYD మేథావులు BRS వైపే ఉన్నారని.. లోక్సభ ఎన్నికల్లో తాము గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. ఇప్పటికే సికింద్రాబాద్లో గెలిచేశామని, ఎందుకంటే అక్కడ నిలబడ్డది టి.పద్మారావు అని భరోసా వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డికి ఓటమి తప్పదన్నారు.
Similar News
News January 9, 2025
శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు
మాదాపూర్లోని శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నాట్య గురువు నిర్మల విశ్వేశ్వర్ రావు శిష్యబృందం చేసిన నృత్యాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కళాకారులు సనాతన నర్తన గీతం, పుష్పాంజలి, భజమానస, గీతం, చక్కని తల్లికి, రామ గీతం, తాండవ నృత్యకారి, తరంగం, మంగళం తదితర అంశాలను ప్రదర్శించి అలరించారు.
News January 9, 2025
GHMC: జనవరి 31 లాస్ట్ డేట్, తర్వాత చర్యలే!
గ్రేటర్ HYD నగర వ్యాప్తంగా దుకాణ,వ్యాపార సముదాయాలు ఉన్నవారు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ తెలిపింది. జనవరి 31వ తేదీ వరకు మీసేవ, ఆన్లైన్ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకుని పొందొచ్చన్నారు. అంతేకాక ఫీజు పెండింగ్ సైతం 31 తేదీలోపు చెల్లించాలని, లేదంటే తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 8, 2025
పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే స్థానిక ఎన్నికలు: JAC
తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించడంలేదని సర్పంచుల సంఘం JAC నిరసన తెలిపింది. అనంతరం నాంపల్లిలోని TG ఎన్నికల కమిషనర్కి వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య, కార్యదర్శి నాగయ్య పాల్గొన్నారు.