News February 22, 2025

ఎండతో భగ్గుమంటున్న జనగామ!

image

జనగామ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. పలు చోట్ల ఉదయం మంచు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఎండ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతేకాదు, చెరువులు, వాగులు, కుంటల్లో సైతం నీరు ఖాళీ అవుతోంది. దీంతో ప్రయాణం సాగించాలంటేనే వృద్ధులు, పిల్లలు జంకుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎండ ప్రభావం ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News October 28, 2025

2 రాష్ట్రాల్లో ఓట్లు… పీకేకు EC నోటీసులు

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్‌కు EC నోటీసులు జారీ చేసింది. ఆయనకు 2 రాష్ట్రాల్లో ఓటు ఉండడమే దీనికి కారణం. పీకే WBలో ఓటరుగా ఉన్నారు. తర్వాత కర్గహార్ (బిహార్) నియోజకవర్గ ఓటరుగా నమోదు అయ్యారు. రెండు చోట్ల ఓట్లుండటాన్ని గుర్తించిన EC వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చింది. అయితే బిహార్‌లో ఓటరుగా నమోదయ్యాక WB ఓటును తొలగించాలని PK అప్లై చేశారని ఆయన టీమ్ సభ్యులు తెలిపారు.

News October 28, 2025

MBNR: మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పరిశీలన

image

వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మంగళవారం సందర్శించారు. మొక్కలు ఎండబెట్టుకుని శుభ్రంగా తీసుకొస్తే ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని సూచించారు. పత్తి రైతులతో మాట్లాడుతూ.. స్లాట్ బుకింగ్ చేసుకుని వస్తే సీసీఐ పత్తి కొనుగోలు చేసిందన్నారు. తుపాన్ కారణంగా రేపు ఎల్లుండి వర్షం పడే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తగా తీసుకోవాలన్నారు.

News October 28, 2025

ప్రజలు ఇబ్బందులు పడకూడదు: మంత్రి అచ్చెన్న

image

కోనసీమ జిల్లాలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెన్న ఆదేశించారు. అమలాపురం ఆర్డీవో ఆఫీసులో ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తుఫాన్ గండం నుండి బయట పడాలని ఆకాంక్షించారు.