News February 22, 2025
ఎండతో భగ్గుమంటున్న హనుమకొండ!

హనుమకొండ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. పలు చోట్ల ఉదయం మంచు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఎండ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతేకాదు, చెరువులు, వాగులు, కుంటల్లో సైతం నీరు ఖాళీ అవుతోంది. దీంతో ప్రయాణం సాగించాలంటేనే వృద్ధులు, పిల్లలు జంకుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎండ ప్రభావం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News December 17, 2025
పవన్, లోకేశ్‌లపై చంద్రబాబు ప్రశంసలు.. కలెక్టర్లకు దిశానిర్దేశం

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు నిత్య విద్యార్థుల్లా ఉంటూ, డేటా ఆధారిత పాలన సాగించాలని సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. కానిస్టేబుల్ కోరిక మేరకు అక్కడికక్కడే రోడ్డు మంజూరు చేయడాన్ని గుర్తుచేశారు. అలాగే వైజాగ్‌కు గూగుల్ డేటా సెంటర్ తెచ్చిన మంత్రి లోకేశ్‌ను అభినందించారు.
News December 17, 2025
భూపాలపల్లి జిల్లాలో 11 గంటలకు 61.64 శాతం పోలింగ్

భూపాలపల్లి జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 61.64 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత తెలిపారు. మండలాల వారీగా మహాముత్తారంలో అత్యధికంగా 70.23%, మహాదేవపూర్‌లో 63.31%, మలహర్‌లో 61.66%, మరియు కాటారంలో 54.60% ఓటింగ్ నమోదైంది. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ అంతా ప్రశాంతంగా కొనసాగుతోంది.
News December 17, 2025
సూర్యాపేట: @11AM.. పోలింగ్ శాతం ఎంతంటే?

సూర్యాపేట జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 11 వరకు నమోదైన పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు.
చింతలపాలెం – 64.93%
గరిడేపల్లి – 62.10%
హుజూర్నగర్ – 53.57%
మట్టంపల్లి – 65.93%
మేళ్లచెర్వు – 56.42%
నేరేడుచర్ల – 50.53%
పాలకవీడు – 61.69%
జిల్లాలోపోలింగ్ సరాసరి 60.13% నమోదైనట్లు వివరించారు.


