News February 10, 2025
ఎండపల్లి: ఉరేసుకున్న యువతి

ఉరేసుకుని ఓ యువతి <<15412992>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఐ ఉమా సాగర్ తెలిపిన వివరాల ప్రకారం..ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన శ్రావణి(23) చదువు రావడంలేదు అని, తను తల్లిదండ్రులకు భారం కావద్దని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 9, 2026
విజయ్‌కి మరోసారి సీబీఐ నోటీసులు

కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోగా 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనవరి 12, 19వ తేదీల్లో సీబీఐ ఆయనను విచారించింది.
News March 9, 2026
చిత్తూరు: మామిడి రైతుల కష్టాలు తీరేనా.?

మామిడి రైతులు గతేడాది భారీ నష్టాలను చవిచూశారు. అయితే పల్ప్ యూనిట్లు మాత్రం ఉత్పత్తి అయిన 5 లక్షల మెట్రిక్ టన్నుల పల్ప్‌లో దాదాపు 75% విక్రయించాయి. ఇందులో 45%కిపైగా పల్ప్ కంపెనీలకు ట్రాన్స్‌ఫోర్ట్ కాగా మరో 25-30% సీజన్ మొదలయ్యేలోపు రవాణా కానుంది. ఈసారి మామిడికి మంచి రేట్లు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్ల సిండికేట్లకు చెక్ పెడితే రైతులకు గిట్టుబాటు ధర తథ్యమంటున్నారు.
News March 9, 2026
కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 9760 మంది హాజరు

కడప జిల్లాలో సోమవారం 62 సెంటర్లలో జరిగిన ఇంటర్ 2nd ఇయర్ గణితం పేపర్-2B పరీక్షలకు 96% మంది విద్యార్థులు హాజరయ్యారు. నేటి పరీక్షలకు 10,136 మంది విద్యార్థులకు గాను.. 9,740 మంది విద్యార్థులు హాజరయ్యారు. 396 మంది ఆబ్సెంట్ అయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 9381 మందికి గాను.. 9120 మంది పరీక్షలు రాశారు. 261 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 755 మందికి గాను.. 620 మంది హాజరయ్యారు.


