News April 1, 2025
ఎండపల్లి: జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక

ఎండపల్లి గుల్లకోట గ్రామానికి చెందిన వంగపల్లి గౌతమి ఇటీవలే జరిగిన హ్యాండ్ బాల్ సీనియర్ ఉమెన్ విభాగంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజేందర్, శ్రీను తెలిపారు. ఏప్రిల్ 1నుంచి 4 వరకు ఉత్తరప్రదేశ్లో జరిగే 53 వ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు.
Similar News
News September 18, 2025
రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

AP: రాబోయే 4 రోజులు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి తదితర జిలాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది.
News September 18, 2025
జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్

ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు 83,761 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు సరఫరా చేసినట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి గురువారం తెలిపారు. ప్రస్తుతం 29,512 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండగా, మరో 259 మెట్రిక్ టన్నులు రానున్నాయని చెప్పారు. ఎరువుల కొరత లేదని స్పష్టం చేస్తూ, రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడవద్దన్నారు. పంటలకు తగిన మోతాదులపై గ్రామ స్థాయి సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు.
News September 18, 2025
పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, పర్యాటకం, ఎంప్లాయిమెంట్, కేవీఐబీ అధికారులతో సమావేశమయ్యారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడే స్థిరమైన వృద్ధిరేటు సాధించగలమన్నారు.