News April 7, 2025
ఎండలతో జాగ్రత్త!

నంద్యాల జిల్లాలో నేటి నుంచి క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 41-43°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా నిన్న జిల్లాలోని దొర్నిపాడులో అత్యధికంగా 40.6°C ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News October 19, 2025
నిర్మల్: మద్యం దుకాణాలకు 942 దరఖాస్తులు

మద్యం దుకాణాలకు 942 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్ తెలిపారు. జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించారు. శనివారం ఒక్కరోజే 529 దరఖాస్తులు వచ్చాయని ఇందులో భైంసా ఎక్సైజ్ పరిధిలో 186 దరఖాస్తులు రాగా నిర్మల్ ఎక్సైజ్ పరిధిలో 343 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. శనివారం రాత్రి వరకు దరఖాస్తులను స్వీకరించారు.
News October 19, 2025
నిర్మల్: మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పొడిగింపు

మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్ ప్రకటించారు. బీసీ బంద్, బ్యాంకుల బంద్ కారణంగా దరఖాస్తులు వేయలేని ఆశావహుల విజ్ఞప్తి మేరకు ఎక్సైజ్ కమిషనర్ ఈ గడువును పెంచారు. అక్టోబరు 27న లక్కీ డ్రా నిర్వహిస్తామని, కావున దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News October 19, 2025
‘కాంతార’లో మెప్పించిన SRపురం వాసి

పాన్ ఇండియా మూవీ ‘కాంతార’లో SRపురం(M) పొదలపల్లికి చెందిన ఏకాంబరం నటించారు. ఇందులో భాగంగా తన నటనకు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి మొచ్చకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన్ను స్వగ్రామం గంగాధర నెల్లూరులో వైసీపీ నేత కృపాలక్ష్మి అభినందించారు. సినిమా రంగంలో మరింత ప్రతిభ చూపి గుర్తించ దగ్గ పాత్రలు పోషించాలని ఆమె ఆకాంక్షించారు.