News March 28, 2024
ఎండలు: ‘హైదరాబాద్‌లో బయటకురాకండి’
HYD, ఉమ్మడి RR జిల్లాల పరిధిలో మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో బోరబండ 40.6, మొయినాబాద్ 40.6, కందుకూరు 40.5, యాలాలలో 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లుగా TSDPS తెలిపింది. BP, షుగర్, చర్మ వ్యాధులు ఉన్నవారు 11AM నుంచి 4PM మధ్య బయటకురాకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Similar News
News November 24, 2024
HYD: 15 ఏళ్లు దాటితే సీజ్ చేయండి: మంత్రి
15 ఏళ్లు దాటిన స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేయాలని ఖైరతాబాద్‌లో జరిగిన మీటింగ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా ఫిట్నెస్, ఇన్స్యూరెన్స్, RC సహా అన్ని పత్రాలు చెక్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 వేల స్కూల్ బస్సులపై నివేదిక ఇవ్వాలన్నారు. 62 రవాణా శాఖ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరు, మౌలిక వసతులపై నివేదిక సిద్ధం చేయాలన్నారు.
News November 24, 2024
HYD: మెనూ పాటించకపోతే చర్యలు: కలెక్టర్
HYD జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలకు కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం ఫుడ్ మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని, లేదంటే టీచర్లపైనా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను ఆయా హెచ్ఎంలు ఎప్పటికప్పుడు మెరుగుపరచాలన్నారు.
News November 24, 2024
గ్రేటర్ హైదరాబాద్‌లో హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు
హుమయూన్‌నగర్‌లోని తెలంగాణ మైనార్టీ పాఠశాల బాలుర -1ను ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లోని వంటగది, భోజనశాల, స్టోర్‌రూమ్, పడకగదులు, ప్రొవిజన్స్, హాస్టల్ రిజస్టర్లను పరిశీలించారు. పిల్లలతో కలసి ఆయన టిఫిన్ చేశారు. టిఫిన్స్ ఎలా ఉన్నాయని విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నిర్వహణ బాగుందని ఆయన ప్రశంసించారు.