News January 20, 2025

ఎండాడలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

ఎండాడ సాయిరాం పనోరమ హిల్స్ వద్ద నూతనంగా నిర్మాణంలో ఉన్న భవంతులలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అనారోగ్యంగా ఉండి మద్యం తాగి మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 9, 2025

విశాఖ: ‘పైనుంచి మిమ్మల్ని చూస్తుంటా’

image

అగనంపూడి సమీపంలో రైలు కింద పడి <<15397134>>సూసైడ్ <<>>చేసుకున్న రాదేశ్(38) జేబులో లేఖ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో తన మృతికి ఎవరూ కారణం కాదని, అన్నయ్య పిల్లలు బాగా చదువుకోవాలని.. పైనుంచి మిమ్మల్ని చూస్తుంటానని రాసి ఉంది. కాగా.. ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడిది శ్రీహరిపురం కాగా.. ఫోను ఇంట్లోనే విడచిపెట్టి అగనంపూడి సమీపంలో రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు.

News February 9, 2025

విశాఖ: రీల్‌కు లైక్ కొట్టి రెండుసార్లు పెళ్లి.. కట్ చేస్తే..!

image

ఓ బాలిక ఇన్‌స్టా‌గ్రామ్‌లో చేసిన రీల్‌కు లైక్ కొట్టి ట్రాప్ చేసిన యువకుడిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. తాటిచెట్లపాలెంకి చెందిన భార్గవ్ ఓ బాలిక చేసిన రీల్‌కు లైక్ కొట్టి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. తనకూ రీల్స్ చేయాలని ఉందని కోఆపరేట్ చేయాలని కోరాడు. ఈ క్రమంలో ఆమెను రెండుసార్లు పెళ్లి చేసుకోగా విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. వారి ఫిర్యాదు మేరకు భార్గవ్‌పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

News February 9, 2025

విశాఖ-ముంబై LTT రైలు రద్దు: డీసీఎం

image

విశాఖ నుంచి ముంబై వెళ్లే LTT రైలును(18519/20) ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. కాజీపేట్ డివిజన్‌లో ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టడం వలన రైలును రద్దు చేసినట్లు వెల్లడించారు. ముంబై నుంచి విశాఖ వచ్చే రైలు కూడా ఫిబ్రవరి 12 నుంచి 22వరకు రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

error: Content is protected !!