News August 12, 2024
ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదు: మంత్రి అనగాని
మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు విచారణ వేగంగా జరుగుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏపీ వ్యాప్తంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులున్నారని ఆరోపించారు. తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో భూములకు సంబంధించిన వందల ఫైళ్లు దొరికాయని అన్నారు. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
Similar News
News September 11, 2024
నేడు గుంటూరుకు జగన్ రాక
వైసీపీ అధినేత జగన్ బుధవారం గుంటూరులో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 11 గంటలకు గుంటూరు సబ్ జైలుకు చేరుకుంటారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్‌తో ములాఖత్ అవుతారు. 11.30 గంటలకు జైలు నుంచి బయల్దేరి ఎస్వీఎన్ కాలనీలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఈదా సాంబిరెడ్డిని పరామర్శిస్తారు. 11.55కి ఎస్వీఎన్ కాలనీ నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.
News September 11, 2024
అమరావతి రైతుల సాయం రూ.3.31లక్షలు
వరద బాధితులకు అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతులు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.3.30 లక్షలు అందజేశారు. సంబంధిత చెక్‌ను సీఎం చంద్రబాబుకు విజయవాడలో అందజేశారు. రైతులను సీఎం చంద్రబాబు అభినందించారు. కార్యక్రమంలో రైతులు చిట్టిబాబు, శ్రీధర్, రవి, అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
News September 10, 2024
ఇండియా-ఏ జట్టులోకి గుంటూరు కుర్రాడు
గుంటూరు కుర్రాడికి ఇండియా టీంలో చోటు దక్కింది. దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఏ జట్టుకు జురెల్ స్థానంలో షేక్ రషీద్‌ను ఎంపిక చేశారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రషీద్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇండియా అండర్-19 జట్టుకూ ప్రాతినిధ్యం వహించాడు. ఈ 19ఏళ్ల గుంటూరు కుర్రాడు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేస్తాడు.