News March 29, 2024

ఎంపీగా గెలిస్తే మహబూబ్‌నగర్ రూపురేఖలు మారుస్తా: వంశీచంద్ రెడ్డి

image

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే మహబూబ్‌నగర్ లోక్‌సభ రూపురేఖలు మారుస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. నేడు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితం మొత్తం ప్రజలతో ముడిపడి ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి అండతో మహహబూబ్‌నగర్ అభివృద్ధి చేసి చూపిస్తామని, ఆరు గ్యారంటీలను నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు.

Similar News

News February 24, 2026

రేపు పీయూలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’

image

పాలమూరు విశ్వవిద్యాలయ పీజీ కళాశాలలో బుధవారం ఉదయం 10:30 గంటలకు ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. పీయూ పరిధిలోని డిగ్రీ, ఇంటర్ ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. స్థానిక భాషతో పాటు ఇంగ్లీష్, హిందీలో ప్రావీణ్యం కనబరిచిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారని ఆయన వెల్లడించారు.

News February 24, 2026

జడ్చర్ల: గొల్లపల్లి చెరువులో మరో యువకుడి మృతదేహం లభ్యం!

image

జడ్చర్ల మండలం గొల్లపల్లి చెరువులో గల్లంతైన రెండో యువకుడు యాదగిరి మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు మంగళవారం వెలికితీశాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్ భద్రతను పర్యవేక్షించగా, ఎస్సై జయప్రసాద్ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. దీంతో ఇద్దరు యువకుల గాలింపు ముగిసింది.

News February 24, 2026

MBNR: పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు!

image

తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు 13 పతకాలు సాధించి సత్తా చాటారు. ఇందులో 2 స్వర్ణ, 3 రజత, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. విజేతలను జిల్లా ఎస్పీ డి.జానకి అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాకు కీర్తి తెచ్చిన క్రీడాకారుల ప్రతిభను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు.