News February 7, 2025

ఎంపీటీసీ ఎన్నికలు: సిద్దిపేట జిల్లా పూర్తి వివరాలు

image

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 4, మున్సిపాలిటీ‌లు 5, జీపీలు 504 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-26, MPP-26, MPTC- 230 ఉన్నాయి. గతంలో 229గా ఉన్న MPTC సంఖ్యను ప్రస్తుతం 230కు అధికారులు పెంచారు. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండటంతో గ్రామాల్లో ప్రస్తుతం సందడి నెలకొంది.

Similar News

News April 17, 2026

భారత్‌కు సౌత్ కొరియా అధ్యక్షుడు

image

సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ భారత్ పర్యటనకు రానున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 19వ తేదీ ఢిల్లీకి చేరుకుంటారు. 20వ తేదీ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఆర్థిక, రక్షణ తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా లీ పర్యటన సాగనుంది. మరోవైపు పశ్చిమాసియా పరిణామాలు సహా అనేక కీలకాంశాలు ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చే అవకాశమున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

News April 17, 2026

ప్రభుత్వ పాఠశాలల్లో ‘త్రీ స్టార్’ వసతులు కల్పించాలి: లోకేశ్

image

ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ కీలక సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ముఖ ఆధారిత గుర్తింపు పురోగతిపై ఆరా తీశారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై చర్చించిన ఆయన, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘త్రీ స్టార్’ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు అత్యుత్తమ వసతులు అందించాలని అధికారులను ఆదేశించారు.

News April 17, 2026

అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి భూప్రకంపనలు

image

అనకాపల్లి జిల్లా పరిధిలో గురువారం అర్ధరాత్రి భూప్రకంపనలు సంభవించాయి. సుమారు 12:31 గంటల సమయంలో 5 నుంచి 10 సెకండ్లపాటు భూమి కంపించినట్లు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించినట్లు సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. మీ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయా? కామెంట్ చేయండి.