News February 12, 2025

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలి : కలెక్టర్

image

ఎంపీటీసీ, జడ్పిటిసి సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని ములుగు కలెక్టర్ దివాకర టిఎస్ సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 87 ఎంపీటీసీ, 10 జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంపత్ రావు పాల్గొన్నారు.

Similar News

News December 3, 2025

KNR: CM మీటింగ్‌కు 144 RTC బస్సులు.. తిప్పలు..!

image

హుస్నాబాద్‌లో తలపెట్టిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు కరీంనగర్ రీజియన్ పరిధిలో ఐదు డిపోల నుంచి 144 ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. వీటిల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రజలను తరలించనున్నారు. ఇదిలాఉండగా నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికోసం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్న అరకొర బస్సులను సీఎం మీటింగ్‌కు అలాట్ చేయడంతో ప్రజలకు తిప్పలు తప్పేలాలేవు.

News December 3, 2025

కాకినాడ: చాపకింద నీరులా ‘స్క్రబ్‌ టైఫస్‌’ వ్యాధి

image

కాకినాడ జిల్లాలో 148 ‘స్క్రబ్‌ టైఫస్‌’ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు DMHO నరసింహ నాయక్ తెలిపారు. కాకినాడ అర్బన్‌‌లో 58, కాకినాడ రూరల్‌ 17, పెద్దాపురం 15, సామర్లకోట 11, తొండంగి 6, ప్రత్తిపాడు 5, తాళ్లరేవు 5, గొల్లప్రోలు 4, కిర్లంపూడి 4, యు.కొత్తపల్లి 4, కరప 4, కాజులూరు 3, రౌతులపూడి 3, జగ్గంపేట 2, పిఠాపురం 2, శంఖవరం 2, తుని 1, ఏలేశ్వరం 1, గండేపల్లి 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

News December 3, 2025

₹274 కోట్లు దోచి పరారైన డోన్ రియల్టర్!

image

డోన్‌కు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని ప్రముఖుల నుంచి ₹274 కోట్లు అప్పులు, పెట్టుబడుల రూపంలో వసూలు చేసి అమెరికా పరారయ్యాడు. చిరుద్యోగి అయిన అతడు స్థిరాస్తి వ్యాపారంలోకి దిగి బెంగళూరులో ఆఫీస్ ప్రారంభించాడు. సొంత డబ్బుతో విదేశీ యాత్రలు, పార్టీలు ఇస్తూ ప్రముఖులకు దగ్గరై భారీగా డబ్బులు వసూలు చేశాడు. కొన్ని రోజులుగా అందుబాటులో లేకపోవడంతో బాధితులు బయటకు చెప్పలేక కుమిలిపోతున్నారు.