News October 17, 2024

ఎంపీతో ఆలపాటి గెలుపుపై చర్చించిన మంత్రి సుభాష్

image

కృష్ణ జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా నియ‌మితులైన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వీరిద్దరూ కాసేపు కృష్ణ‌, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్ర‌స్తుతం నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ గురించి చర్చించుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి గెలుపు అంశంపై చర్చించారు.

Similar News

News November 10, 2024

కృష్ణా: D.El.Ed పరీక్షల హాల్ టికెట్లు విడుదల

image

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(D.El.Ed) 2వ ఏడాది విద్యార్థులు(2018- 20 స్పాట్& మేనేజ్‌మెంట్ బ్యాచ్) రాయాల్సిన సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఈ నెల 14 నుంచి 20 తేదీలలో ఉదయం 9-12 గంటల మధ్య జరుగుతాయని సంచాలకులు కేవీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను https://www.bse.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. 

News November 10, 2024

పామర్రు: ఈ ఆలయంలో భక్తులే పూజారులు

image

పామర్రు మండలం ఉండ్రపూడిలోని సువర్చలా సమేతంగా వెలసిన వీరాంజనేయస్వామి ఆలయం ప్రసిద్ధమైంది. 40 దశాబ్దాల కిందట వెలసిన ఈ స్వామి కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు చెబుతున్నారు. విద్యలో రాణించడానికి చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఈ స్వామిని దర్శించుకుంటారు. ప్రతి రోజూ ఇక్కడ విశేష అర్చనలు, మంగళ, శనివారాలు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులే పూజారులై ఈ స్వామికి అర్చనలు, అభిషేకాలు చేయటం విశేషం.

News November 10, 2024

ఏలూరు, తాడేపల్లిగూడెం వెళ్లే ప్రయాణికులకు గమనిక

image

ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.13351 ధన్‌బాద్-అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌ నవంబర్ 11,12 తేదీలలో ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్ గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. నవంబర్ 11,12 తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదన్నారు.