News April 10, 2024

ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

image

నిజామాబాద్ ఎంపీ అరవింద్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ 2019లో తెస్తే కాంగ్రెస్ లొల్లి పెట్టిందన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముస్లింలకు సైతం పౌరసత్వం ఇవ్వాలని ఆందోళన చేశాడని, ఇప్పుడు సీఏఏ అమలు చేస్తుంటే ఎన్నికలు ఉన్నాయని హిందువుల ఓట్ల కోసం జీవన్ రెడ్డి మౌనంగా ఉన్నాడన్నారు. మరి ముస్లింలకు పౌరసత్వం ఇస్తే ప్రత్యేక ముస్లిం దేశాలు ఎందుకని ప్రశ్నించారు.

Similar News

News March 27, 2025

కామారెడ్డి: చెరువులో నీట మునిగి బాలుడు మృతి

image

HYD గచ్చిబౌలి పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలానికి చెందిన కార్తీక్ (14) చెరువులో నీట మునిగి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కుర్ల గ్రామానికి చెందిన మల్కయ్య-బాలమణి దంపతులు నానక్‌రాంగూడలో పనిచేస్తున్నారు. కాగా కొడుకు కార్తీక్ సోమవారం కనిపించకుండా పోయాడు. మంగళవారం తల్లిదండ్రులు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా బుధవారం విప్రో లేక్‌లో శవమై తేలాడు.

News March 27, 2025

NZB: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం నిజామాబాద్, కామారెడ్డి డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.

News March 27, 2025

KMR: పదో తరగతి ప్రశ్నలు లీక్.. ముగ్గురు సస్పెండ్ (UPDATE)

image

కామారెడ్డి జిల్లా జుక్కల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో పదో తరగతి గణిత ప్రశ్నల లీక్‌పై అధికారులు తీవ్రంగా స్పందించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, DEO రాజు, తహశీల్దార్ విచారణ చేపట్టారు. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ భీం, ఇన్విజిలేటర్ దీపికలను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు.

error: Content is protected !!