News April 26, 2024

ఎంపీ ఎన్నికలు.. నిజామాబాద్‌కు 42 జహీరాబాద్‌కు 40

image

లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. నిజామాబాద్ లోక్‌సభకు 42 మంది అభ్యర్థులు 90 సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ అభ్యర్థులు ధర్మపురి అర్వింద్‌, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు ఇతర పార్టీల వారు నామినేషన్‌ వేశారు. జహీరాబాద్‌ లోక్‌సభకు 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు చివరి తేదీ.

Similar News

News October 1, 2024

అక్టోబర్ 8-10 వరకు కామారెడ్డి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

image

కామారెడ్డి జిల్లాలో అక్టోబర్ 8 నుంచి 10 వరకు జల శక్తి అభియాన్ కేంద్ర బృందం పర్యటిస్తుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంచే పనులను అధికారులు పూర్తి చేసి నివేదికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News September 30, 2024

కామారెడ్డి జిల్లా టాపర్‌గా పిట్లం యువతి

image

సోమవారం వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మార్దండ గ్రామానికి చెందిన కోటగిరి మౌనిక జిల్లాలో మొదటి స్థానం సాధించింది. దీంతో ఆమెను తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ జిల్లా మొదటి స్థానం సంపాదించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News September 30, 2024

NZB: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య ఎలా జరుపుకోవాలని నిజామాబాద్, కామారెడ్డి జిల్లావాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.