News June 3, 2024
ఎంపీ ఎన్నికల్లో పాలేరు నుంచి భారీ మెజార్టీ రాబోతుంది: మంత్రి

ఎంపీ ఎన్నికల్లో పాలేరు. నియోజకవర్గంలో నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ రాబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం కొత్త కొత్తూరు గ్రామంలో మంత్రి పొంగులేటి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అడిగిన ప్రతి న్యాయమైన కోరికలను తీరుస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో పేదవారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోహిణి కార్తెలో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకే ‘కల్చరల్ ఫెస్ట్’: ఛైర్మన్ శ్రీధర్

ఖమ్మం శ్రీచైతన్య కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్-2025 వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ అధ్యక్షత వహించగా, CBI మాజీ జేడీ VV లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈఉత్సవాలు ఒత్తిడిని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకేనని ఛైర్మన్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రధాని నుంచి పురస్కారం అందుకున్న కళాశాల విద్యార్థిని పల్లవిని ఈ సందర్భంగా సత్కరించారు.
News December 13, 2025
పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు. కామేపల్లిలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. సామగ్రి పంపిణీ, ఏర్పాట్లను పర్యవేక్షించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో రవీందర్, మండల స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్, MRO సుధాకర్ పాల్గొన్నారు.
News December 13, 2025
ఎన్నికల సామగ్రి కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ శ్రీజ

నేలకొండపల్లి మండలంలోని కొత్త కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీజ శనివారం పరిశీలించారు. ఆమె బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రి సరఫరా ప్రక్రియను పర్యవేక్షించి, ఎన్నికల సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. సిబ్బంది జాగ్రత్తగా విధులను నిర్వహించాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఎర్రయ్య, ఎంపీఓ శివ పాల్గొన్నారు.


