News April 18, 2024
ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల డిపాజిట్లు ఎంతంటే…!

ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసే సాధారణ(ఓసీ, బీసీ) అభ్యర్థులు రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 డిపాజిట్ చెల్లించాలి. ఎమ్మెల్యేగా పోటీ చేసే సాధారణ అభ్యర్థులు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు చొప్పున డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది.
Similar News
News November 20, 2025
కర్నూలు జిల్లాలో 8,051 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపితే ఒక నెల జైలు శిక్షతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 17వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో 8,051 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
News November 19, 2025
అన్నదాతకు ప్రభుత్వం అండ: కలెక్టర్

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ 2025-26 2వ విడత కింద జిల్లాలో 2,72,757 మంది రైతులకు రూ.181.51 కోట్లు జమయ్యాయని కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. కోడుమూరు ఆర్.కొంతలపాడులో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఉల్లి, మిర్చి, పత్తి పంటల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 11 పత్తి మిల్లులు పనిచేస్తున్నాయన్నారు.
News November 19, 2025
డిజిటల్ అరెస్ట్ అంటేనే మోసం: ఎస్పీ

డిజిటల్ అరెస్ట్ అంటేనే మోసం అని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు పోలీసులు/సీబీఐ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ చేసి భయపెట్టడం, వివరాలు తీసుకుని డబ్బులు దోచుకోవడం వంటి కేసులు పెరుగుతున్నాయన్నారు. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్ చేయరని, ఫోన్‌లో డబ్బులు అడగరని స్పష్టం చేశారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930కి లేదా Kurnool Cyber Policeను సంప్రదించాలన్నారు.


