News April 18, 2024
ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల డిపాజిట్లు ఎంతంటే…!
ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసే సాధారణ(ఓసీ, బీసీ) అభ్యర్థులు రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 డిపాజిట్ చెల్లించాలి. ఎమ్మెల్యేగా పోటీ చేసే సాధారణ అభ్యర్థులు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు చొప్పున డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది.
Similar News
News September 20, 2024
587 మొబైల్స్ రికవరీ: ఎస్పీ
కర్నూలు జిల్లా పరిధిలో రూ.1,33,70,000 విలువ చేసే 587 మొబైల్స్‌ను ఎస్పీ బిందు మాధవ్ బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. మొబైల్ పోగొట్టుకున్న వారికి రికవరీ చేసి అందజేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎలాంటి రుసుము లేకుండా అందజేశామన్నారు. పోలీస్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News September 20, 2024
ముచ్చట్ల ఆలయ పూజారి కుమార్తెకు MBBSలో సీటు
బేతంచెర్ల మండలం రంగాపురానికి చెందిన ముచ్చట్ల ఆలయ పూజారి చంద్రమోహన్ రావు, వరలక్ష్మీ దంపతుల కుమార్తె ఇందు ప్రసన్నలక్ష్మీ కర్నూలు మెడికల్ కళాశాలలో MBBS సీటు సాధించింది. నీట్ ఫలితాల్లో 720 మార్కులు గాను 644 మార్కులు సాధించింది. గ్రామీణ విద్యార్థికి MBBSలో సీటు రావడం పట్ల గ్రామస్థులుచ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
News September 20, 2024
నేటి నుంచి 26వ తేదీ వరకు ప్రజా వేదికలు: కలెక్టర్
ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలపై నేటి నుంచి 26వ తేదీ వరకు ప్రజా వేదికలు నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు, డోర్ స్టిక్కర్లను అందజేసి, కరపత్రంలోని విషయాలను ప్రజలకు వివరిస్తారని తెలిపారు.