News April 11, 2025
ఎంపీ కావ్యకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

వరంగల్ ఎంపి డా.కడియం కావ్య పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘డా. కడియం కావ్య.. మీకు హృదయపూర్వక పుట్టినరోజుకు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. మీ జీవితం ఆనందం, శాంతి మరియు శ్రేయస్సుతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను’ అని శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు.
Similar News
News April 18, 2025
మన ‘ఓరుగల్లు’లో ఎన్నో చారిత్రక కట్టడాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వేయి స్తంభాల గుడి, కాకతీయ కళా తోరణం, ఖిలా వరంగల్, కోటలు, పలు గ్రామాల్లో వారు నిర్మించిన శివాలయాలు, ఇతర దేవాలయాలు ఉన్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాగా, నేడు అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం.
News April 18, 2025
మామునూరు ఎయిర్‌పోర్టు.. నెక్స్ట్ ఏంటి?

మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. ఇందుకు 949ఎకరాలు అవసరమవగా 696ఎకరాలు సేకరించారు. మరో 253ఎకరాల కోసం 3గ్రామాలను ఒప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అక్కడి భూముల ధరలు అమాంతం పెరగడంతో ఎకరాకు రూ.5కోట్లు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. దీంతో ఎయిర్‌పోర్టు అంశం పట్టాలు తప్పినట్లేనా అని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. సమస్యను క్లియర్ చేసి త్వరగా నిర్మించాలని కోరుతున్నారు.
News April 18, 2025
కేసీఆర్ సెంటిమెంట్.. WGL, KNR మధ్యలో BRS సభ

KCR సెంటిమెంట్ జిల్లాలైన KNR, WGL జిల్లాల మధ్యలో ఈనెల 27న BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 20లక్షల మందితో 1500ఎకరాల్లో సభ ఏర్పాటు చేయనున్నారు. 50వేలకు పైగా వాహనాలు వస్తాయనే అంచనాతో 169ఎకరాలు సభకు, మిగతాదంతా(1,331) పార్కింగ్‌కు కేటాయించారు. 300 LED స్క్రీన్లు, 15లక్షల మజ్జిగ, 15లక్షల వాటర్ ప్యాకెట్లు, తాత్కాలిక ఆస్పత్రి, అంబులెన్సులు, 4 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.