News April 11, 2025
ఎంపీ కావ్యకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

వరంగల్ ఎంపీ కడియం కావ్య పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు గురువారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘డా. కడియం కావ్య.. మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. మీ జీవితం ఆనందం, శాంతి, శ్రేయస్సుతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ లేఖ రాశారు.
Similar News
News October 25, 2025
హైదరాబాద్ వెదర్ అప్డేట్

నగరంలో ఈరోజు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పలు చోట్ల పొగమంచుతో కూడిన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 28°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 23°Cగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఊహించడానికే భయంకరంగా ఉంది: రష్మిక

కర్నూలు <<18088805>>బస్సు<<>> ప్రమాద ఘటనపై రష్మిక తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘అగ్ని ప్రమాద ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. మంటలలో చిక్కుకున్న ప్రయాణికుల బాధ ఊహించడానికే భయంకరంగా ఉంది. చిన్నపిల్లలు, మొత్తం కుటుంబం, చాలా మంది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నా. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి’ అని Xలో పేర్కొన్నారు.