News December 18, 2024

ఎంపీ ధర్మపురి అరవింద్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

image

ఎంపీ ధర్మపురి అరవింద్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పీఎస్‌లలో నమోదైన కేసుల్లో విచారణాని ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. బంజారాహిల్స్‌, అబిడ్స్‌ పీఎస్‌లలో అరవింద్‌పై 3 కేసులు నమోదు అయ్యాయి. అప్పటి సీఎం కేసీఆర్‌ను కించపర్చేలా మాట్లాడారంటూ ఫిర్యాదులు రాగా, కేసులను కొట్టేయాలంటూ అరవింద్ పిటిషన్లు దాఖలు చేశారు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్: రెండు రౌండ్లలో కలిపి పోలైన ఓట్లు ఎన్నంటే?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ 1,144 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 18,617, BRS అభ్యర్థికి 17,473 ఓట్లు పోలయ్యాయి. మరో 8 రౌండ్లు మిగిలి ఉన్నాయి.

News November 14, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: మిగిలిన 8 రౌండ్లు కీలకం

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం రెండు రౌండ్లలో ఆయన ఆధిక్యం 1,144కు చేరింది. రెండో రౌండ్లో నవీన్ యాదవ్‌కు 9691, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8609 ఓట్లు వచ్చాయి. ఇంకా 8 రౌండ్లు మిగిలి ఉండగా.. అభ్యర్థి గెలుపులో కీలకం కానున్నాయి.

News November 14, 2025

జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్.. BRS మరింత అప్రమత్తం!

image

ఈరోజు జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్‌కు BRS అధిష్ఠానం మరింత అప్రమత్తమైంది. పాలకులు తప్పుదారి పట్టిస్తారేమోనని అనుమానం వచ్చి HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌కు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లను రంగంలోకి దించింది. ఎర్రోళ్ల శ్రీనివాస్, చిరుమర్తి లింగయ్య,క్రాంతి కిరణ్, గండ్ర వెంకట రమణారెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులను కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించి కౌంటింగ్‌లో జరిగే తప్పులను గట్టిగా నిలదీసేలా ప్లాన్ చేసింది.