News September 13, 2024
ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉన్న హత్యాయత్నం కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పుంగనూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన న్యాయమూర్తి విచారణ అనంతరం ఆ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాతి విచారణ ఈనెల 17కి వాయిదా పడింది.
Similar News
News November 3, 2025
ప్రపంచ కప్‌లో కడప అమ్మాయికి 14 వికెట్లు

భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కడప జిల్లాకు చెందిన శ్రీచరణి(21) కీలక పాత్ర పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆమె జట్టులోకి అడుగు పెట్టారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా ఇప్పటి వరకు ఆమె 22 వికెట్ల పడగొట్టారు. వరల్డ్ కప్‌లోని 9 మ్యాచుల్లోనే 14 వికెట్లు తీయడం విశేషం. ఓ బాల్ స్పిన్, మరో బాల్ నేరుగా వేసి బ్యాటర్లను తికమకపెట్టారు. సెమీస్‌లో ఆస్ట్రేలియా స్కోర్ మరింత పెరగకుండా చివరి ఓవర్లు కట్టుదిట్టంగా వేశారు.
News November 3, 2025
పెన్షన్ కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు

భర్త మరణించి మూడేళ్లు గడిచినా పెన్షన్ కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్లు గోపవరం(M) సండ్రపల్లికి చెందిన చెన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. పెన్షన్ కోసం దరఖాస్తు చేసినా సచివాలయ అధికారుల నుంచి సరైన స్పందన లేదని వాపోయారు. అధికారులు కరుణించి, వితంతు పెన్షన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నట్లు ఆమె కనీటి పర్యంతమయ్యారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.
News November 2, 2025
వరల్డ్ కప్.. వికెట్ పడగొట్టిన శ్రీచరణి

మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇందులో భాగంగా కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన టీం ఇండియా బౌలర్ శ్రీచరణి వికెట్ పడగొట్టింది. సౌతాఫ్రికా 62 పరుగుల వద్ద ఉండగా ఆమె బ్యాటర్ బాష్(Bosch)ను రెండో వికెట్‌గా పెవిలియన్‌కు పంపింది.


