News September 13, 2024
ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉన్న హత్యాయత్నం కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పుంగనూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన న్యాయమూర్తి విచారణ అనంతరం ఆ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాతి విచారణ ఈనెల 17కి వాయిదా పడింది.
Similar News
News October 5, 2024
కడప జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు
కడప జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ శివ శంకర్ ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో ఉన్న ఎమ్మార్వోలకు స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే సంబంధిత ప్రదేశాలలో రిపోర్ట్ చేసుకోవాలని కలెక్టర్ ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను, ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు.
News October 5, 2024
కడప జిల్లాలో డిప్యూటీ తహశీల్దార్లు బదిలీ
కడప జిల్లా వ్యాప్తంగా డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 12 మంది డిప్యూటీ ఎమ్మార్వోలకు స్థానచలనం కల్పిస్తూ జేసీ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సంబంధిత స్థానాల్లో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేసినట్లు జేసీ పేర్కొన్నారు.
News October 5, 2024
మైదుకూరు: అవకతవకలపై 15 మందికి నోటీసులు
కడప జిల్లా మైదుకూరు మండలంలో ఫ్రీహోల్డ్ భూములపై జరిగిన అవకతవకలపై 15 మందికి నోటీసులు జారీ చేసి.. వారి సంజాయిషీలను సమర్పించాలని ఆదేశించినట్లు కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి శుక్రవారం తెలిపారు. ఫ్రీహోల్డ్ భూములపై వచ్చిన ఆరోపణల మేరకు.. రీ ఎంక్వయిరీ చేసి అక్కడ అవకతవకలు, తప్పులు జరిగినట్లు గుర్తించామన్నారు. దీంతో అక్కడ పనిచేసిన ఒక తహశీల్దార్‌తోపాటు 14 మంది వీఆర్వోలకు షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు.