News April 10, 2025
ఎంపీ మేడాకు నోటీసులు

MP మేడా రఘునాథరెడ్డి, మాజీ MLA మేడా మల్లిఖార్జునరెడ్డిలకు JC రాజేంద్రన్ నోటీసులు జారీ చేశారు. వీరు నందలూరు (M) లేబాకలో పేదల పేరుతో అక్రమంగా దాదాపు 109 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణల కారణంగా నోటీసులు ఇచ్చారు. దీనిపై సరైన వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని JC హెచ్చరించారు.
Similar News
News October 21, 2025
ట్రంపే కాదు.. ఆయన సెక్రటరీ అంతే!

US ప్రెసిడెంట్ ట్రంప్ నోటి దురుసు గురించి తెలిసిందే. ఈ విషయంలో తానేం తక్కువ కాదని వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ నిరూపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు త్వరలో ట్రంప్, పుతిన్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో భేటీ కానున్నారు. ఈ హైలెవెల్ సమ్మిట్‌కు ఆ లొకేషన్ ఎవరు ఎంపిక చేశారని ఓ జర్నలిస్ట్ కరోలిన్‌కు మెసేజ్ చేశారు. ‘మీ అమ్మ చేసింది’ అని ఆమె బదులివ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
News October 21, 2025
ఎంపీ కలిశెట్టి దీపావళి వేడుకలు భళా

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రణస్థలం ప్రభుత్వ బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులకు స్వీట్స్ పంచి వారితో బాణాసంచా కాల్చారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా బాలికలతో ఇలా దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎంపీ తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
News October 21, 2025
H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. USలో చదువుతున్న వారికి హెచ్-1బీ వీసా ఫీజు నుంచి సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ మినహాయింపు కల్పించింది. అమెరికా బయటి నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలని స్పష్టం చేసింది.