News March 12, 2025
ఎంపీ ల్యాడ్స్ పనులు పూర్తి చేయాలి

ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో మంగళవారం ఎంపీ ల్యాడ్స్‌తో చేపట్టిన పనుల పురోగతిపై ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 48 పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.
Similar News
News March 16, 2025
SP నుంచి ఉత్తమ CIగా ప్రశంస.. ఒక్కరోజులోనే సస్పెండ్

రెండు రోజుల క్రితం SP నుంచి ఉత్తమ పని తీరు కనబరిచిన CI.. 24 గంటలు గడవక ముందే సస్పెండ్ కావడం చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. పుంగనూరులో శనివారం రామకృష్ణ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో DIG ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన SP మణికంఠ.. పుంగనూరు CI శ్రీనివాసులు నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగినట్లు నిర్ధారించారు. దీంతో CIతోపాటూ హెడ్ కానిస్టేబుల్‌ను స్సస్పెండ్ చేశారు.
News March 15, 2025
చిత్తూరు: వైసీపీ అనుబంధ విభాగాల నియామకం

చిత్తూరు జిల్లాకు చెందిన పలువురికి వైసీపీ రాష్ట్ర అనుబంధ విభాగాలలో చోటు కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మైనార్టీ విభాగం స్టేట్ జోనల్ అధ్యక్షునిగా షఫీ అహ్మద్ ఖాద్రి, కార్యదర్శులుగా అబ్బాస్, మహీన్, జాయింట్ సెక్రటరీలుగా సర్దార్, నూర్, ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీగా భాస్కర్ రెడ్డి, సెక్రటరీగా యుగంధర్ రెడ్డి నియమితులయ్యారు.
News March 15, 2025
చిత్తూరు జిల్లాలో నేటి నుంచి ఒంటిపూట బడులు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే బడులు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న 118 పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు పనిచేయాలని ఉత్తర్వుల్లో సూచించారు.