News December 3, 2024
ఎంపీ వద్దిరాజు ఉప రాష్ట్రపతితో సమావేశం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్ తో సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా రాజ్యసభలోని ఛైర్మన్ ఛాంబర్ కు ఎంపీ రవిచంద్ర సోమవారం ఉదయం వెళ్లి ధనఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతితో రాజ్యసభ సభ్యుడు పలు అంశాలపై చర్చించారు.
Similar News
News December 4, 2024
ACB టోల్ ఫ్రీ నెంబర్ పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం: ACB టోల్ ఫ్రీ నెంబర్ 1064 విస్తృత ప్రచార నిమిత్తం రూపొందించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. లంచం ఇవ్వవద్దని, లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదులకు 9154388989/040-23251555, వాట్సాప్ నెంబర్ 9440446106, ఇ-మెయిల్ dg_acb@telangana.gov.in, KMM రేంజ్ 9154388981/ 0874-2228663 కు సంప్రదించాలన్నారు.
News December 3, 2024
నిపుణుల బృందానికి వరద నష్టం వివరాలను తెలిపిన జిల్లా కలెక్టర్
ఖమ్మం జిల్లాకు మంగళవారం విచ్చేసిన అంచనా నిపుణుల బృందానికి ఇటీవలి వరద నష్ట తీరు, చేపట్టిన చర్యల వివరాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. 229 గ్రామాలలో, 42 పట్టణ ప్రాంతాల్లో 53,430 మంది జనాభా ప్రభావితమయ్యారని, 59 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 9516 మందిని శిబిరాలకు తరలించడం జరిగిందని తెలిపారు. 6 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్కొక్కరికి ₹5 లక్షల చొప్పున ₹30 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించామన్నారు.
News December 3, 2024
రేపు ESIM బ్రాంచ్ కార్యాలయం ప్రారంభోత్సవం
ఖమ్మం రాపర్తి నగర్, వెజిటబుల్ మార్కెట్ రోడ్ లో గల BSNL భవన ప్రాంగణంలో ESI డిస్పెన్సరీ కమ్ బ్రాంచ్ నూతన కార్యాలయాన్ని బుధవారం ప్రారంభిస్తున్నట్లు బ్రాంచ్ మేనేజర్ జి. సాయి కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రం ద్వారా కార్మికులు వైద్య, అనారోగ్య, ప్రసూతి, వృత్తిపరమైన ప్రమాదాలు, శాశ్వత వైకల్యం, డిపెండెంట్ ప్రయోజనాలు పొందవచ్చని బ్రాంచ్ మేనేజర్ పేర్కొన్నారు.