News April 19, 2024
ఎంపీ RRR తరుఫున సతీమణి, కొడుకు నామినేషన్

ఉండి నియోజకవర్గ MLA అభ్యర్థిగా ఎంపీ రఘురామకృష్ణరాజు తరుఫున నామినేషన్ దాఖలు చేశారు. RRR సతీమణి రమాదేవి ఉండి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ ఆదిత్యకు ఈరోజు ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమె వెంట రఘురామకృష్ణరాజు తనయుడు భరత్, తదితరులు ఉన్నారు. రఘురామకు ఎక్కడి టికెట్ కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ వీడకపోవడంతో ఆయన తన సతీమణి, కుమారుడితో నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది.
Similar News
News September 18, 2025
మెగా డీఎస్సీ అభ్యర్థులకు నేడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ

మెగా డీఎస్సీ నియామక పత్రాలు జారీ ప్రక్రియ 19వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డీఈవో వాసుదేవరావు బుధవారం తెలిపారు. టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులందరూ 18వ తేదీన ఒక సహాయకునితో రాజమండ్రిలో కేటాయించిన పాఠశాలలకు రెండు పాస్ పోర్ట్ ఫోటోలు, ఆధార్ కాల్ లెటర్తో సాయంత్రం 4 గంటలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, బస్సుల్లో విజయవాడ పంపుతామన్నారు.
News September 18, 2025
పీహెచ్డీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: వీసీ

యూజీసీ నెట్, జేఆర్ఎఫ్, సీఎస్ఐఆర్ నెట్ లలో అర్హత సాధించిన అభ్యర్థులకు పీహెచ్డీ ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. యూనివర్సిటీలో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్లు బుధవారం ఆమె వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్సైట్లో చూడవచ్చని సూచించారు.
News September 18, 2025
రాజమండ్రి అభివృద్దిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజమండ్రిలో వివిధ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఇంచార్జి కమిషనర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ అధికారులు హాజరయ్యారు. అభివృద్ధి పనులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చర్చించారు.