News March 26, 2024

ఎంపీ ‘RRR’ పోటీపై ఆసక్తి.. ‘పశ్చిమ’ నుంచే బరిలో..?

image

నరసాపురం MP రఘురామరాజు ఉమ్మడి ప.గో జిల్లాలోనే ఏదైనా స్థానం నుంచి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరసాపురం BJP టికెట్ ఆయనకేనని అంతా భావించగా.. శ్రీనివాసవర్మ అనే మరో నేతకు టికెట్ దక్కింది. దీంతో RRRకు ‘పశ్చిమ’లో TDP నుంచి అసెంబ్లీ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. అయితే.. ఇప్పటికే అక్కడ అభ్యర్థులందరూ ఖరారు కాగా.. ఎవరినైనా ఆపి RRRకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై సమాచారం సేకరిస్తున్నారట.

Similar News

News December 4, 2025

RJY: 13న జాతీయ లోక్ అదాలత్

image

జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్‌.శ్రీలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె రాజమండ్రిలో మాట్లాడారు. త్వరితగతిన, తక్కువ ఖర్చుతో సామాన్యులకు న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమన్నారు. రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకునేందుకు కక్షిదారులు ఈ అవకాశాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు.

News December 4, 2025

నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లేవారు నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. చాగల్లు మండలం దారావరం గ్రామానికి చెందిన షైక్ నాగూర్ బేబీ ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో చిక్కుకున్నారు. కలెక్టర్ చొరవ, వికాస సంస్థ కృషి కారణంగా నాగూర్ బేబీ సురక్షితంగా స్వస్థలానికి చేరుకున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమె గురువారం కలెక్టర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

News December 4, 2025

ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: కందుల

image

ఆంధ్రప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. గురువారం రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాజమండ్రి నగరం పర్యాటకం, సంస్కృతి & వినోద రంగాల్లో మరింత అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.