News April 18, 2024
ఎంబీఏ లాజిస్టిక్ సప్లయ్ చైన్ మేనేజ్మెంట్లో ప్రవేశాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీఏ లాజిస్టిక్స్ సప్లయ్ చైన్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రెండేళ్ల కాల వ్యవధి తో నిర్వహించే ఈ కోర్సులో ప్రవేశాలకు జూన్ 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలించి జూన్ 20న ప్రవేశాలు కల్పిస్తారు. రక్షణ రంగాల్లో పనిచేసే వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రవేశాల ప్రాధాన్యత ఇస్తారు. కోర్సు ఫీజుగా ఏడాదికి రూ.60 వేలు చెల్లించాలి.
Similar News
News November 10, 2025
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు పూర్తికావాలి: కలెక్టర్

ఈ నెల 14,15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు 12వ తేదీ సాయంత్రం నాటికి పూర్తికావాలని అధికారులకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నిర్దేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ఎక్కడా ఎలాంటి సమన్వయ లోపం రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సదస్సులో ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం, కేంద్రమంత్రులు భాగస్వామ్యం కానున్నారని సూచించారు.
News November 10, 2025
గోపాలపట్నంలో వివాహిత అనుమానాస్పద మృతి

గోపాలపట్నం సమీపంలో రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్న శ్యామల అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పది నెలల క్రితం వేపాడ దిలీప్ శివ కుమార్‌తో వివాహం కాగా తల్లిదండ్రులు భారీగానే ఇచ్చారు. సోమవారం శ్యామల చనిపోయినట్లు సమాచారం అందడంతో తల్లి వచ్చి చూసి ముఖం పైన బలమైన గాయాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతుర్ని అల్లుడు, బంధువులే చంపేశారని ఫిర్యాదు చేశారు. మృతురాలి శ్యామల నేవిలో ఉద్యోగం చేస్తోంది.
News November 10, 2025
గాజువాక: బార్లో వెయిటర్ ఆత్మహత్య

గాజువాకలోని ఓ బార్లో వెయిటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. వై.జంక్షన్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్లో చంద్రమోహన్ అనే వ్యక్తి వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. బార్లోనే చంద్రమోహన్ ఉరివేసుకోవడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.


