News March 18, 2025

ఎంవీపీ కాలనీ: ప్రేయసికి పెళ్లయిందని యువకుడి అదృశ్యం

image

ప్రేయసికి పెళ్లయిందని ఓ యువకుడు అదృశ్యమైన ఘటన ఎంపీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతవెంకోజిపాలెంలో ఉంటున్న యువకుడు(20) ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. తన ప్రేయసికి పెళ్లయిందని తెలిసి ఆదివారం సాయంత్రం ఇంట్లోంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 18, 2025

దాకమర్రి లేఅవుట్ ధర తగ్గింపు: VMRDA ఎంసీ 

image

విజయనగరానికి దగ్గరలో దాకమర్రి లే అవుట్‌లో స్థలాల ధరలను గజం రూ.20వేల నుంచి రూ.15,500 తగ్గించినట్టు VMRDA ఎంసీ విశ్వనాథన్ తెలిపారు. నివాస స్థలాలు ధరలు ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం ప్రభుత్వం ధరలను తగ్గించిందని చెప్పారు. ఈ లేఅవుట్ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.

News March 18, 2025

టైమ్ బ్యాంక్ కాన్సెప్ట్‌తో ఒంట‌రిత‌నం దూరం: కలెక్టర్

image

టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా వ‌యోవృద్ధుల‌కు ఒంట‌రిత‌నం పోతుంద‌ని, అవ‌స‌రమైన స‌మ‌యంలో తోడు దొరుకుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. మంగళవారం టైమ్ బ్యాంక్ నిర్వ‌హించిన సెమినార్లో క‌లెక్ట‌ర్ మాట్లాడారు. వ‌యోవృద్ధుల‌కు టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స‌హాయకులు అండ‌గా నిలుస్తార‌న్నారు. వ‌యో వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్ర‌భుత్వం విభిన్న రీతిలో కృషి చేస్తోంద‌న్నారు.

News March 18, 2025

విశాఖ: టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు?

image

విశాఖలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు అమరావతి చేరుకున్నట్లు సమాచారం. కార్పొరేషన్‌లో బలం పెరిగాక మేయర్‌పై అవిశ్వాసం పెట్టే యోచనలో కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల చేరికపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.

error: Content is protected !!