News March 16, 2025
ఎఐ ద్వారా విద్యా బోధన: ASF అదనపు కలెక్టర్

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా 3, 4, 5 తరగతుల విద్యార్థుల కోసం ఏఐ ద్వారా విద్య బోధన చేయనున్నట్లు ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం కెరమెరి మండలం గోయగం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. పాఠశాలలో వెనుకబడిన విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Similar News
News December 4, 2025
Party Time: గ్రామాల్లో జోరుగా దావతులు

పంచాయతీ ఎన్నికల పుణ్యమాని గ్రామాల్లో దావతులు జోరందుకున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పల్లెల్లో సాయంత్రం కాగానే పెద్ద ఎత్తున పార్టీలు చేసుకుంటున్నారు. ఇందుకోసం పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను గ్రూపుల వారీగా విభజించి మద్యం, స్టఫ్ సమకూరుస్తున్నారు. ప్రతిరోజు కొన్ని గ్రూపులకు దావత్ ఏర్పాటు చేయాల్సి రావడంతో అభ్యర్థుల చేతి చమురు భారీగానే వదులుతోంది.
News December 4, 2025
విశాఖ: క్రికెటర్ కరుణ కుమారికి ఘన సత్కారం

అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ బాలికల అంధుల రెసిడెన్షియల్ విద్యార్థిని కరుణ కుమారిని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఘనంగా సత్కరించారు. ప్రపంచ కప్‌కు సెలెక్ట్ అయిన తరువాత ప్రాక్టీస్‌కు అనుగుణంగా కరుణకుమారికి ప్రత్యేకంగా రెండు క్రికెట్ కిట్లకు రూ.50వేలు ఇవ్వడం జరిగిందన్నారు. భారత జట్టు విజయంలో కీలక ప్రతిభ చూపిన ఆమెకు ప్రోత్సాహకంగా కలెక్టర్ రూ.లక్ష చెక్ అందజేశారు
News December 4, 2025
కామారెడ్డి: డీజీపీకి పూల మొక్కను అందజేసిన కలెక్టర్

డీజీపీ శివధర్ రెడ్డిని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డిలో మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు. జిల్లాలో శాంతి భద్రతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.


