News March 21, 2024

ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తాం: మంత్రి జూపల్లి

image

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా కల్పించారు. నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండాలన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై అధికారులు సర్వే చేస్తున్నారని, పంట నష్టపోతే ఎకరానికి 10 వేల పరిహారం అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని, తమ పాలనలో రైతులకు ఇబ్బందులు ఉండవని అన్నారు.

Similar News

News September 16, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద

image

శ్రీశైలం జలాశయంలో ఆదివారం రాత్రి 9 గంటలకు 883.30 అడుగులు, నీటి నిల్వ 206,0906 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 41,287 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 68,194 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.

News September 16, 2024

MBNR: 11ఏళ్ల నిరీక్షణకు తెర.. బదిలీలపై టీచర్ల సంతోషం

image

ఆదర్శ పాఠశాలల్లో ఎట్టకేలకు 11ఏళ్ల తర్వాత బదిలీలు చేపట్టడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2013లో ఈ పాఠశాలలు ప్రారంభించగా.. అప్పటి నుంచి బదిలీలు చేపట్టలేదు. తాజాగా విద్యాశాఖ PGT, TGTలను పాత జోన్ల ప్రకారం బదిలీలు చేసింది. దీంతో ఆదర్శ పాఠశాలల్లో మొత్తం 160 ఖాళీలు ఉన్నాయి. సెలవు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల పలువురు ఆందోళనకు గురయ్యారు.

News September 16, 2024

‘ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి’

image

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని పీయూ అధ్యాపకులు ఎంపీ డీకే అరుణకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో పీయూలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమను ఆమె దర్శించుకున్నారు. విద్యార్థి సంఘ నాయకులు వారిచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. 12 యూనివర్సిటీల్లో 1445 మంది అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారని, తమను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.