News January 28, 2025
ఎకో టూరిజం స్పాట్‌గా వికారాబాద్: CM

వికారాబాద్‌ను ఎకో టూరిజం స్పాట్‌గా చేస్తామని CM రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో ఎక్స్పీరియం పార్కు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో టూరిజం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. మల్లెలతీర్థం, కొల్లాపూర్‌లో అద్భుతమైన ప్రకృతి ఉందని, వాటినీ అభివృద్ధి చేస్తామన్నారు.
Similar News
News December 9, 2025
ఈ మండలాల్లో ఎన్నికల ప్రచారం చేయవద్దు: సుర్యాపేట ఎస్పీ

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యపేట, ఆత్మకూర్, మద్దిరాల, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి ఈ మండలాలలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల సమయం ముగిసిందని ఎస్పీ నర్సింహ ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా చేరవద్దని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 9, 2025
సూర్యాపేట: ముగిసిన మొదటి విడత ఎన్నికల ప్రచారం

సూర్యాపేట జిల్లాలో గ్రామపంచాయతీ, వార్డు సభ్యుల ఎన్నికల మొదటి విడత ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి బరిలో నిలిచిన వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ఈనెల 11న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారంలో నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
News December 9, 2025
మెదక్: సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా చుక్క రాములు

సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా చుక్క రాములు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెదక్‌లో మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర 5వ మహాసభల్లో ఈ మేరకు తీర్మానం చేశారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పాలడుగు భాస్కర్, కోశాధికారిగా రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అనేక కార్మిక అంశాలపై తీర్మానాలు చేశారు. నూతన కార్యవర్గానికి మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం అభినందనలు తెలిపారు.


