News September 14, 2024
ఎక్కడా చిన్నపాటి సంఘటన చోటు చేసుకోకూడదు: ఎస్పీ

కర్నూలులో రేపు గణేశ్ నిమజ్జనోత్సవం నేపథ్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. ‘ఎక్కడా చిన్నపాటి సంఘటన చోటు చేసుకోకూడదు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు. శోభయాత్రలో ప్రజలు, భక్తుల పట్ల పోలీసులు సత్ప్రవర్తనతో మెలగాలి. నిమజ్జనం ముగిసే వరకు పోలీసులు తమకు కేటాయించిన విధుల్లో ఉండాలి’ అని దిశా నిర్దేశం చేశారు.
Similar News
News December 11, 2025
కర్నూలు: ‘ఈనెల 21న జరిగే పల్స్ పోలియోను విజయవంతం చేయండి’

డిసెంబర్ 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు 3,52,164 మంది పిల్లలకు వందశాతం టీకా వేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జరిగిన మెడికల్ ఆఫీసర్ల సెన్సిటైజేషన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పీహెచ్సీలు, యుపిహెచ్సీలలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. బయటికి మందులు పంపకూడదు, డెలివరీ తర్వాత డబ్బులు వసూలు చేయకూడదు అని స్పష్టం చేశారు.
News December 11, 2025
కర్నూలు కలెక్టర్కు 9వ ర్యాంకు.. మంత్రి టీజీ భరత్ ర్యాంక్ ఇదే..!

కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికి సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 9వ ర్యాంక్ ఇచ్చారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక మొత్తం 1,023 ఫైల్స్ స్వీకరించారు. వాటిలో 714 ఫైల్స్ క్లియర్ చేశారు. ఫైళ్ల క్లియరెన్స్లో కర్నూలు జిల్లా మంత్రి టీజీ భరత్ 17వ స్థానంలో నిలిచారు. 548 ఫైళ్లను పరిష్కరించారు.
News December 10, 2025
100 రోజులు ప్రచారం చేయండి: కలెక్టర్

బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే మన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏఎస్పీ హుస్సేన్ పీరాతో కలిసి బాల్య వివాహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా 100 రోజులు నిర్విరామంగా ప్రచారాలు చేయాలని అధికారులను ఆదేశించారు.


