News September 14, 2024

ఎక్కడా చిన్నపాటి సంఘటన చోటు చేసుకోకూడదు: ఎస్పీ

image

కర్నూలులో రేపు గణేశ్ నిమజ్జనోత్సవం నేపథ్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. ‘ఎక్కడా చిన్నపాటి సంఘటన చోటు చేసుకోకూడదు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు. శోభయాత్రలో ప్రజలు, భక్తుల పట్ల పోలీసులు సత్ప్రవర్తనతో మెలగాలి. నిమజ్జనం ముగిసే వరకు పోలీసులు తమకు కేటాయించిన విధుల్లో ఉండాలి’ అని దిశా నిర్దేశం చేశారు.

Similar News

News October 13, 2024

ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు: కర్నూలు ఎస్పీ

image

కర్నూలు (D) హోలగుంద మండల పరిధిలోని దేవరగట్టులో శనివారం రాత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కర్రల సమరం శాంతియుతంగా ముగిసిందని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదని, 60 మందికి చిన్నపాటి గాయాలైనట్లు గుర్తించామని పేర్కొన్నారు. సంబరంలా వేడుకలు జరిగాయని అన్నారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి, ఇతర శాఖల వారికి, మీడియాకు ఆయన అభినందనలు తెలిపారు.

News October 13, 2024

ఉపాధి ద్వారా రూ.83 కోట్లతో పనులు: కలెక్టర్

image

పల్లె పండుగ వారోత్సవాలు రేపటి నుంచి వారం రోజుల పాటు జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రారంభమవుతున్నాయని కలెక్టర్ రంజిత్ బాషా ఆదివారం పేర్కొన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, గోకులం, పౌల్ట్రీ షెడ్ల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా 1,533 పనులకు రూ.83 కోట్లతో శంకుస్థాపనలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోందన్నారు.

News October 13, 2024

మూడుకు చేరిన మృతుల సంఖ్య

image

దేవరగట్టు మాలమల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవానికి వెళ్తూ శనివారం రాత్రి అరికెర, కరిడిగుడ్డం గ్రామాల మధ్యలో బైక్ అదుపు తప్పి ముగ్గురు మృతి చెందారు. బళ్ళారి జిల్లా తగ్గిన బూదహల్ గ్రామానికి హరీశ్(22), మల్లికార్జున(26) అక్కడికక్కడే మృతి చెందగా.. రవి కుమార్(27) బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్నేహితులు మృతి చెందడంతో తల్లితండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.