News June 25, 2024
ఎక్కువ మంది పిల్లలను కనొద్దు: గీతాలక్ష్మి

సమాజంలో మహిళల ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ గీతాలక్ష్మి సూచించారు. ఎక్కువమంది పిల్లలను కనడం, ఎక్కువసార్లు ఆపరేషన్లు చేయడం ఆడవారి ఆరోగ్యానికి ప్రమాదకరమని చెప్పారు. సంతానం విషయంలో ప్రతిఒక్కరూ అవగాహనతో మెలగాలన్నారు. ‘ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు’ అనే నినాదాన్ని పాటించాలని పిలుపునిచ్చారు.
Similar News
News November 15, 2025
శ్రీకాంత్‌ను త్వరగా తీసుకురండి.. పెళ్లి చేసుకోవాలి: అరుణ

పెరోల్‌పై బయటికి వచ్చిన తర్వాత శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అనవసరంగా తనను కేసుల్లో ఇరికించారని లేడీ డాన్ అరుణ పోలీసులు ఎదుట వాపోయిందట. ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులు 2 రోజులు ఆమెను కస్టడీకి తీసుకున్నారు. కస్టడీలో ఆమె పోలీసులకు సహకరించలేదని సమాచారం. శ్రీకాంత్‌కు త్వరగా బెయిల్ తీసుకురావాలని, తనను పెళ్లి చేసుకోవాలని కోరినట్లు సమాచారం.
News November 15, 2025
ప్రతి 20KM కు EVఛార్జింగ్ స్టేషన్ కోసం కసరత్తు

జిల్లాలో EV వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు పెంచేందుకు కసరత్తు మొదలైంది. జాతీయ రహదారులపై ప్రతి 20KM కు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనకు అనుగుణంగా అధికారులు చర్యలు ప్రారంభించారు. PMఈ-డ్రైవ్ పథకం కింద ఏర్పాటు చేసే ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్లకు 80% రాయితీ లభిస్తుంది. పబ్లిక్, ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇప్పటికే 25 స్థలాలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.
News November 15, 2025
చేజర్ల మండలంలో రోడ్డు ప్రమాదం

చేజర్ల మండలం ఏటూరు కండ్రిక వద్ద శుక్రవారం గేదెను బైకు ఢీకొట్టింది. నాగులవెల్లటూరు గ్రామానికి చెందిన ముప్పసాని బాబు పోస్టల్ శాఖలో పనిచేస్తున్నారు. పొదలకూరు నుంచి పని ముగించుకుని తన గ్రామానికి తిరిగి వస్తుండగా గేదెను ఢీకొనడంతో గాయపడ్డాడు. స్థానికులు 108 సాయంతో పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


