News February 28, 2025

ఎక్స్‌పో 2025లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

image

మహిళా వ్యవస్థాపక స్ఫూర్తిని పురస్కరించుకుని ఉమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్(WISE&B2B) ఎక్స్‌పో 2025లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చెందడానికి, ఆర్థిక వృద్ధికి దారితీసే సమ్మిళిత పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి తెలంగాణ కట్టుబడి ఉందన్నారు.

Similar News

News November 27, 2025

సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తులు

image

శ్రీసిటీ వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్-01 పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. M.Tech ఇన్ ECE పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://iiits.ac.in/careersiiits/jrf-srf-project-positions/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 05.

News November 27, 2025

పవిత్ర పంబా నది విశేషాలు మీకు తెలుసా?

image

పంబా నది ప్రస్తావన త్రేతాయుగం నుంచి ఉంది. అందుకే పవిత్ర నదిగా దీన్ని పరిగణిస్తారు. ఇది ఔషధ మూలికల సారంతో ప్రవహిస్తుందని నమ్ముతారు. ఈ నదిలో స్నానం చేస్తే వన యాత్ర అలసట మాయమవుతుందట. యాత్రలో భాగంగా స్వాములు ఇక్కడ స్నానమచారిస్తుంటారు. ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే 7 తరాల వారికి మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడ కొలువైన కన్నెమూల మహా గణపతిని దర్శించి యాత్రను కొనసాగిస్తారు. <<-se>>#AyyappaMala<<>>

News November 27, 2025

పాలమూరు: మాజీ సర్పంచ్ హత్య.. చేసింది వీళ్లే.!

image

కేటీదొడ్డి మండలం నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసులో పోలీసులు పది మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.8.5 లక్షల నగదు, నాలుగు కార్లు, రెండు బైకులు, ఒక బొలెరో వాహనం, 11 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ధరూర్ మండలం జాంపల్లి వద్ద చిన్న భీమరాయుడును బొలెరో వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే.