News March 12, 2025
ఎగ్జిబిషన్ సొసైటీ పూర్వవైభవానికి కృషి: కలెక్టర్

దశాబ్దాల చరిత్ర ఉన్న కృష్ణా పారిశ్రామిక, వ్యవసాయ ఎగ్జిబిషన్ సొసైటీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషిచేయడం జరుగుతుందని, సొసైటీ కార్యకలాపాలకు జవసత్వాలు తెచ్చేందుకు సమగ్ర కార్యాచరణ అవసరమని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులతో సమావేశమయ్యారు.1975 మొదలు సొసైటీ కార్యకలాపాల్లో చోటుచేసుకున్న ఘటనలను సభ్యులు వివరించారు.
Similar News
News March 22, 2025
ఉమ్మడి కరీంనగర్: వర్షానికి నేలకు కూలిన మొక్కజొన్న పంటలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న పంట నేలకు ఒరిగింది. పలుచోట్ల వరద నీరు చేరి పంట నీట మునిగింది. చేతికి అందిన పంట నేలపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తగినంత నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
News March 22, 2025
ట్రంప్ ఎఫెక్ట్..5.30 లక్షల మంది లీగల్ స్టేటస్ రద్దు

USAలో తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలకు చెందిన దాదాపు 5.30 లక్షల మంది పౌరులు అమెరికా వీడనున్నారు. వచ్చే నెల 24తో వారి లీగల్ స్టేటస్ రద్దవుతుంది. యుద్ధం లేదా ఇతర కారణాలతో అనిశ్చితి నెలకొన్న దేశాలకు చెందిన పౌరులకు ఈ హోదా ద్వారా అమెరికాలో తాత్కాలిక నివాసం కల్పిస్తారు.
News March 22, 2025
గుంటూరు హైవేపై ఘోర ప్రమాదం.. ఒకరు మృతి

గుంటూరు జాతీయ రహదారిపై, అద్దంకి వెళ్లే మార్గంలో మేదరమెట్ల వద్ద శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి గుంటూరు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని, గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి సమయం కావడంతో మరణించిన వ్యక్తి వివరాలు, వాహనం ఆనవాళ్లు లభించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.