News March 18, 2025

ఎచ్చెర్లలో దారుణ హత్య

image

ఎచ్చెర్ల మండలం సంతసీతారామపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య నాగమ్మ (40) ను భర్త అప్పలనాయుడు కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయాడు. హత్యకు కుటుంబంలో గొడవలే కారణమని సమాచారం.

Similar News

News April 18, 2025

శ్రీకాకుళం: కలెక్టర్‌ను కలిసిన ఉపాధ్యాయ సంఘ నాయకులు

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో గురువారం ఎన్జీవో నాయకులు హనుమంతు సాయిరాం ఆధ్వర్యంలో కలిసి కుప్పిలి సంఘటనలో ఉపాధ్యాయుడుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కలెక్టర్‌ని కోరారు. హెచ్ఎం ప్రమోషన్ సీనియారిటీ లిస్టులో ఉన్న ఇద్దరి పైన కూడా ఛార్జెస్ పెండింగ్‌ను క్లియర్ చేసి ప్రమోషన్‌కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. UTF రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

News April 17, 2025

శ్రీకాకుళం: భద్రతపై ఈవీఎం నోడల్ అధికారి సంతృప్తి

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంల భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్‌లోని గోదాంను రాష్ట్ర ఈవీఎం నోడల్ అధికారి విశ్వేశ్వరరావు గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు ఈ తనిఖీలు చేపట్టామన్నారు. గోదాములో అమలులో ఉన్న ట్రిపుల్ లాక్ విధానం, 24 గంటల సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

News April 17, 2025

శ్రీకాకుళం: మత్స్యకార ఆర్థిక భరోసాపై ఎన్యుమరేషన్

image

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మత్స్యకారులకు రూ. 20 వేల ఆర్థిక భరోసాకు శుక్రవారం నుంచి ఎన్యుమరేషన్ చేస్తామని జిల్లా ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ గురువారం తెలిపారు. జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు ఉన్న మత్స్యకారుల వివరాలు సేకరిస్తామన్నారు. నాటు పడవలో ఎంతమంది సముద్రంలో వేట చేస్తున్నారు. మోటార్ బోర్డుపై వేట చేస్తున్న మత్స్యకారుల డేటా ఆన్‌లైన్ చేస్తామన్నారు.

error: Content is protected !!